Sunday, September 7, 2025

ఇయర్ గ్రేట్ ఇండియన్ బ్యూటీ ఫెస్టివల్ 2025ను ఆవిష్కరించిన VLCC

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్యూటీ అండ్ వెల్ నెస్ బ్రాండ్ అనగానే మన అందరికి గుర్తుకు వచ్చేది VLCC. ఇప్పటికే ఎంతోమంది వినియోగదారుల ఆదరాభిమానాలను చూరగొన్న VLCC.. ఇప్పుడు తమ విలువైన వినియోగదారుల కోసం ది గ్రేట్ ఇండియన్ బ్యూటీ ఫెస్టివల్ 2025ను ప్రకటించింది. ఇది భారతదేశంలో నెల రోజుల పాటు జరిగే అతిపెద్ద బ్యూటీ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ ద్వారా కట్టింగ్ ఎడ్జ్ స్కిన్ కేర్ ఇన్నోవేషన్స్, ఫెస్టివ్ స్పెషల్ ట్రీట్ మెంట్స్ మరియు ఈ ఏడాదిలోనే గతంలో ఎన్నడూ ఇవ్వని ఆఫర్స్ ఉంటాయి.

ఈ సెప్టెంబర్ నెల మొత్తం, భారతదేశం అంతటా వినియోగదారులు VLCC యొక్క అడ్వాన్స్ డ్ స్కిన్ మరియు బాడీ సొల్యూషన్స్, ఫెస్టివ్ గ్లో ఫేషియల్స్, యాంటి ఏజింగ్ ట్రీట్ మెంట్స్, పిగ్మెంటేషన్ కరెక్షన్ నుంచి పెయిన్ లెస్ లేజర్ హెయిర్ రిడక్షన్ వరకు, ఇన్ఫ్యూజన్ థెరపీ మరియు ఫుల్ మేకోవర్ ప్యాకేజీలపై 50 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 219+ క్లినిక్‌లలో 250+ క్లినిక్ లలో VLCC డాక్టర్ ప్యానెల్ యొక్క కాంప్లిమెంటరీ కన్సల్టేషన్స్ మరియు హోలిస్టిక్ స్కిన్ హెల్త్ చెక్స్ పొందవచ్చు. అలాగే ప్రతీ విలువైన వినియోగదారుడికి పర్సనలైజ్ డ్ గైడెన్స్ ను కూడా అందించడం జరుగుతుంది.

మరోవైపు VLCC ఈ ఏడాదిలో అత్యంత ఉత్తేజకరమైన ఆవిష్కరణలను తమ వినియోగదారులకు పరిచయం చేస్తోంది. NCTF®135HA యాంటీ-ఏజింగ్ స్కిన్ బూస్టర్ మరియు బయోరీపీల్® అనేది స్కిన్ హెల్త్ ని బాగుపర్చి మరింత ఉత్తేజాన్ని మరియు కోల్పోయిన కాంతిని తిరిగి తీసుకువచ్చే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చికిత్సలు. వీటికి అదనంగా పాలీన్యూక్లియోటైడ్‌లతో రీజనరేట్ చేసే స్కిన్ బూస్టర్ ఎట్రెలక్స్ న్యూక్లియోటైడ్, డీప్ హైడ్రేషన్ మరియు టిష్యూ రిపేర్ కోసం హైమాజిక్™-4D హైలురోనిక్ యాసిడ్ కాంప్లెక్స్, స్కిన్ హెల్త్ మరియు పునరుజ్జీవనాన్ని ప్రోత్సహించడానికి స్టెమ్ సెల్-డిరైవ్ డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్, సైటోకిన్‌లను ఉపయోగించే బయోటెక్నాలజీ చికిత్స అయినటువంటి AnteAGE MD® అందుబాటులో ఉన్నాయి.

ఈ సందర్భంగా VLCC చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ తానియా పాండే మాట్లాడుతూ, “VLCCలో, బ్యూటీ అనేది కాలానుగుణమైనది కాదని, అది ఒక నిరంతర ప్రక్రియ మరియు వేడుక అని మేము నమ్ముతాము. గ్రేట్ ఇండియన్ బ్యూటీ ఫెస్టివల్ అనేది అందం, చర్మ సంరక్షణను ఆనందం, విశ్వాసం, పరివర్తన యొక్క అనుభవంగా మార్చడానికి మా మార్గం. ఈ పండుగ కేవలం డిస్కౌంట్ల గురించి మాత్రమే కాదు, ప్రపంచ స్థాయి చర్మ సంరక్షణను ప్రతీ ఒక్కరికీ అందించడం మరియు మరియు ప్రతి కస్టమర్ పండుగకు సిద్ధంగా, నమ్మకంగా మరియు శ్రద్ధగా భావించేలా చేయడం గురించి.” అని అన్నారు.

ఈ సందర్భంగా VLCC గ్లోబల్ సర్వీసెస్ అధ్యక్షుడు ఆనంద్ వాస్కర్ వ్యాఖ్యానిస్తూ, “గ్రేట్ ఇండియన్ బ్యూటీ ఫెస్టివల్ అనేది అందం మరియు చర్మ సంరక్షణను పెద్ద ఎత్తున జరుపుకోవడంలో VLCCకి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. NCTF®135HA స్కిన్ బూస్టర్ మరియు బయోరీపీల్® వంటి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆవిష్కరణల పరిచయంతో, సురక్షితమైన, ప్రభావవంతమైన మరియు ఫలితాల ఆధారితమైన అధునాతన చర్మసంబంధ పరిష్కారాల మా పోర్ట్‌ ఫోలియోను మేము మరింత బలోపేతం చేస్తున్నాము. భారతదేశం అంతటా ఉన్న కస్టమర్‌లకు ప్రపంచ స్థాయి చర్మ సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సాటిలేని విలువను అందించడం మా లక్ష్యం. ది గ్రేట్ ఇండియన్ బ్యూటీ ఫెస్టివల్ 2025 ద్వారా ఈ ప్రత్యేకమైన అందం అనుభవాన్ని మా వినియోగదారులకు అందించడం పట్ల మేము గర్విస్తున్నాము.” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News