Saturday, August 23, 2025

‘ఓట్ల చోరీ’పై నిరసన.. లోగోను ఆవిష్కరించిన సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా జరిగిన పలు ఎన్నికల్లో ‘ఓట్ల చోరీ’ జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం ఖండించినా.. కాంగ్రెస్ నేతలు మాత్రం ‘ఓట్ల చోరీ’ జరిగిందని బలంగా వాదిస్తున్నారు. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా తాజాగా ఓట్ల చోరీపై బిజెపిపై విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంలో ఎఐసిసి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఓట్ల చోరీకి సంబంధించిన లోగోనే సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ మీనాక్షి నటరాజన్, టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌తో పాటు పలువురు పిఎసి సభ్యులు పాల్గొన్నారు. ఓట్ల చోరీని అడ్డుకుందామని.. రాహుల్ గాంధీ పోరాటానికి మద్ధతు ఇద్దామని సిఎం పిలుపునిచ్చారు.

Also Read : వెనక్కి తగ్గేదే లేదు: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News