Tuesday, August 26, 2025

‘స్థానిక’ ఎన్నికలకు తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 2న విడుదల

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో స్థానిక సంస్థలకు ఎన్నికలకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా రాష్ట్ర ఎన్నికల సంఘం తన వంతు కసరత్తు చేపట్టింది. ఇందుకు గాను గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో భాగంగా ఈ నెల 28న గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల వద్ద వార్డుల వారీగా ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాలను ప్రదర్శించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 29న జిల్లాల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు సమావేశం కావాలని,

30న మండల స్థాయిలో అన్ని మండల కార్యాలయాల వద్ద అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కావాలని సంబంధిత ఎంపిడివోలను ఆదేశించింది. ఈ నెల 28 నుంచి 30 వరకు వార్డుల వారీగా ప్రకటించిన ఓటర్ల జాబితాలో ఏదైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాని ఎన్నికల సంఘం పేర్కొంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని సంబంధిత డిపిఓలు ఈ నెల 31న పరిష్కరించాలని తెలిపింది. సెప్టెంబర్ రెండున గ్రామపంచాయతీల పరిధిలో వార్డుల వారీగా తుది ఫోటో ఓటర్ల జాబితాలను ఆయా జిల్లా పంచాయతీ అధికారులు ప్రకటించాలని సూచిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారులు, అదనపు జిల్లా ఎన్నికల అధికారులు, ఎంపిడిఓలు, తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News