Thursday, May 22, 2025

‘వృషభ’లో ఉత్తమ యోధుడిలా..

- Advertisement -
- Advertisement -

మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్ పుట్టిన రోజు (మే 21) సందర్భంగా ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చారు. మాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా వైడ్‌గా వస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘వృషభ’ (Vrishabha) చిత్రం ఒకటి. అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతోన్న ఈ చిత్రం నుంచి మోహన్‌లాల్ బర్త్ డే సందర్భంగా అదిరిపోయే పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘వృషభ’ నుంచి రిలీజ్ చేసిన ఈ మోషన్ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో మోహన్‌లాల్ కనిపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. మోహన్‌లాల్ ఆహార్యం, కనిపించిన విధానం, ఆ కత్తి పట్టుకున్న తీరు, జుట్టు ఎగురుతున్న స్టైల్ ఇవన్నీ చూస్తుంటే ఇందులో ఉత్తమ యోధుడిలా కనిపించబోతోన్నారనిపిస్తోంది.

‘నా అభిమానులకు బర్త్ డే సందర్భంగా ఈ అప్డేట్‌ను అంకితం చేస్తున్నాను.. ఇకపై వారి ఎదురుచూపులకు తెర దించినట్టే.. అందరినీ కట్టి పడేసేలా, అందరినీ ఆకట్టుకునేలా ‘వృషభ’ చిత్రం ఉంటుంది’ అని మోహన్‌లాల్ పోస్ట్ చేశారు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిలిమ్స్ సమర్పణలో నంద కిషోర్ రచన, దర్శకత్వంలో ‘వృషభ’ రాబోతోంది. యాక్షన్, ఎమోషన్, పౌరాణిక గాథలను అద్భుతంగా మిళితం చేసి ఓ దృశ్య కావ్యంలా సినిమాను రూపొందిస్తున్నారు. మలయాళం, తెలుగులో ఏకకాలంలో చిత్రీకరిస్తున్న ఈ మూవీనీ అక్టోబర్ 16న తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ అనే ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News