హైదరాబాద్: తన బంధువుపై దాడి చేసిన కేసులో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ను (Dasari Kiran) ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కిరణ్‌ను విజయవాడకు తరలించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉంటున్న దాసరి కిరణ్ బంధువు గాజుల మహేశ్ ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్నారు.
అయితే రెండు సంవత్సరాల క్రితం కిరణ్ (Dasari Kiran), మహేశ్ నుంచి రూ.4.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని మహేశ్ పలుమార్లు కోరిన కిరణ్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఈ నెల 18న విజయవాడలోని కిరణ్ కార్యాలయానికి మహేశ్, ఆయన భార్య వెళ్లారు. అప్పడు కిరణ్ అనుచరులు దాదాపు 15 మంది వారిపై దాడి చేశారు. దీంతో మహేశ్ పటమట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తాజాగా కిరణ్‌ని అరెస్ట్ చేశారు.