సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి
ఏడుగురు, నెల్లూరు జిల్లా కారు దుర్ఘటనలో
ఆరుగురు మృతి మృతుల్లో ఒకే కుటుంబానికి
చెందిన నలుగురు దుర్ఘటనలపై ప్రధాని
మోడీ, ఎపి, తెలంగాణ సిఎంలు చంద్రబాబు,
రేవంత్ దిగ్భ్రాంతి ఎక్స్‌గ్రేషియా ప్రకటన
క్షతగాత్రులకు విపక్షనేత జగన్ పరామర్శ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలోని సింహాద్రి అప్పన్న ఆలయంలో మాటలకందని విషాదం చోటు చేసుకుంది. అప్పన్న సన్నిధిలో చందనో త్సవ సమయంలో బుధవారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. రూ.300 టికెట్ క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులపై గోడ కూలడం తో ఏ డుగురు భక్తులు దుర్మరణం చెందా రు. మరో నలుగురు భ క్తులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలిం చారు. ఇక మృతి చెందిన వారి మృతదేహాల ను విశాఖ జిజిహెచ్‌కు తరలించారు. మంగళవారం కురిసిన భారీ వ ర్షానికి గోడ కూలిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తు న్నారు. సింహగిరి బస్టాండ్ నుం చి పైకి వెళ్లే మార్గంలో ఉన్న కొత్త షాపింగ్ కాం ప్లెక్స్ దగ్గర గోడ కూలింది. గోడ నాసిరకంగా ఉండటం వల్లే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు.
మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో సాఫ్ట్‌వేర్ దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు, శైలజ, ఆమె తల్లి పైలా వెంకటరత్నం, మేనత్త గుజ్జరి మహాలక్ష్మి ఉన్నట్లు నిర్ధారించారు. మృతులు ఉమామహేశ్వరరావు హెచ్.సి.ఎల్. లోనూ, శైలజ ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఇంజి నీర్లుగా పనిచేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం వీరికి వివాహమైంది. ప్రస్తుతం వీరికి వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో ఇంటికి వచ్చారు. వీరంతా విశాఖపట్నం నగరానికి చెందిన వారు. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన ప్రధాని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు అందిస్తామన్నారు.
కలచి వేసింది : సిఎం చంద్రబాబు
ఈ సంఘటనపై ఎపి సిఎం చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా గోడ కూలిన ఈ ఘటనలో మరణించిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడానని, గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించినట్లు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఈ విషాద ఘటనపై చంద్రబాబు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీతో విచారణకు ఆదేశించారు. చనిపోయినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం, గాయపడిన వారికి రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖల పరిధిలోని ఆలయాల్లో అవుట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం ఇవ్వాలని తీసుకున్నారు. గోడ కూలి భక్తులు మరణించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తుల మృతి తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
బాధిత కుటుంబాల జగన్ పరామర్శ…
సింహాచలంలో జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని, ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించాలని వైసిపి అధినేత వైఎస్ జగన్ డిమాం డ్ చేశారు. చందనోత్సవానికి ఆరు రోజుల ముందు గోడ కట్టారన్న జగన్ హడావిడిగా నిర్మించారన్నారు. కనీసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని ముందుగా అంచనా వేసినా తగినముందస్తు చర్యలు తీసుకోలేదని జగన్ ఫైర్ అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఎన్ని ప్రమాదాలు జరిగాయో అందరూ చూస్తున్నారు కదా? అని జగన్ ప్రశ్నించారు. సింహాచలం ప్రమాదంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. విచారణ కమిటీ పేరుతో చంద్రబాబు మ..మ అనిపించడం తప్ప అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేది లేదని తెలిపారు.
ఆరుగురు దుర్మరణం
ఎపిలోని నెల్లూరు జిల్లా కోవూరు మండలం పొతిరెడ్డిపాలెం వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం లో ఇంట్లో ఉన్న వెంకట రమణయ్య (50) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. కారులో ప్రయా ణిస్తున్న వారు నారాయణ మెడికల్ కాలేజీలో మెడిసన్ సెకండియర్ చదువుతున్న ఆరుగురు వైద్య విద్యార్థులు. వారు బుచ్చిరెడ్డిపాలెం వద్ద స్నేహి తుడి అక్క నిశ్చితార్థ కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగా త్రులను చికిత్స కోసం నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సిఎం చంద్రబాబు, విపక్షనేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.