Saturday, July 26, 2025

వార్-2 ట్రైలర్ వచ్చేసింది.. యాక్షన్ సీన్స్ అదుర్స్..

- Advertisement -
- Advertisement -

జూ.ఎన్టిఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘వార్-2’ (War 2). 2019లో వచ్చిన ‘వార్’ సినిమాకు ఇది సీక్వెల్. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో వస్తున్న 6వ చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ ఈ ట్రైలర్ విడుదలైంది. ‘‘నేను అన్నీ వదిలేసి నీడలా మారిపోతాను.. కంటికి కనిపించని త్యాగాలను చేస్తాను.. చివరకు ప్రేమను కూడా వదిలేస్తాను’’ అనే డైలాగ్‌తో హృతిక్ రోషన్ ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత ‘‘నేను మాటిస్తున్నాను.. ఎవ్వరూ చేయలేని పనులను నేను చేస్తాను.. ఎవ్వరూ చేయని యుద్ధాన్ని నేను చేస్తాను‘‘ అంటూ ఎన్టిఆర్ కనిపిస్తారు.

ఈ ట్రైలర్‌లో (War 2) యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా విమానంపై జరిగే ఫైట్‌ ఈ ట్రైలర్‌కే హైలైట్. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అడ్వాణీ నటిస్తోంది. ఈ ట్రైలర్‌లో హృతిక్-కియారాల మధ్య రొమాన్స్‌ని చూపించడంతో పాటు.. వాళ్లిద్దరి మధ్య ఫైట్‌ని కూడా చూపించారు. 2.35 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాని ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ప్రీతమ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News