Wednesday, July 16, 2025

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌ దాడులకు దీటుగా ఇరాన్‌ ప్రతీకార దాడులు నిర్వహిస్తోంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇరాన్‌ మిస్సైల్ లాంచర్లను ఇజ్రాయెల్‌ ధ్వంసం చేసింది. రెండు ఇరాన్‌ డ్రోన్లను ఇజ్రాయెల్ కూల్చేసింది.  టెల్ అవీవ్‌, జెరూసలెం సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరుగుతున్నాయి. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రజలకు భద్రతా బలగాలు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు సురక్షితప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం సూచించింది.

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టింది. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేస్తోంది. ఇరాన్‌లోని 2 అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసింది. ఫార్దో, నతాంజ్‌, ఇన్ఫహాన్‌ అణు స్థావరాలపై దాడికి పాల్పడింది. బి2 స్పిరిట్‌ బాంబర్లతో ఇరాన్‌పై అమెరికా దాడి చేసింది. అమెరికా సైన్యం దాడులు జరిపినట్లు ఆ దేశపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.  ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో అమెరికాలోనూ హై అలర్ట్‌ ప్రకటించారు. భద్రతా సంస్థలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. న్యూయార్క్‌లోని మత, సాంస్కృతిక ప్రదేశాలు, రాయబార కార్యాలయాల దగ్గర పోలీసుల బందోబస్తు పెంచారు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ నిర్ణయం చరిత్రాత్మకమన్న ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రశంసించారు. ఇరాన్ పై అమెరికా బాంబు దాడుల చేయడంతో ట్రంప్ తో నెతన్యాహు ఫోన్‌ లో మాట్లాడారు. ఇరాన్‌పై అమెరికా దాడుల తర్వాత ఇజ్రాయెల్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. ఇరాన్‌పై అమెరికా దాడి చేయడంతో హౌతీ హెచ్చరికలు జారీ చేసింది. ఎర్రసముద్రంలో అమెరికా నౌకలను హౌతీ టార్గెట్‌ చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News