- Advertisement -
వరంగల్: అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని భార్యను చంపబోతుండగా తండ్రి అడ్డురావడంతో అతడిని కుమారుడు చంపాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుబ్బేడి తండాలో సపావత్ సురేశ్(28), మౌనిక(25) అనే దంపతులు నివసిస్తున్నారు. సుపావత్ సురేష్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఇంట్లో గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. అక్రమ సంబంధానికి మౌనిక అడ్డుగా ఉండడంతో ఆమెను చంపాలని సురేష్ నిర్ణయం తీసుకున్నాడు. భార్యను చంపేందుకు ప్రయత్నిస్తుండగా తండ్రి రాజా అడ్డుకోబోయాడు. తండ్రికి బలమైన గాయాలు కావడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు తండాకు చేరుకున్నారు. మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -