ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అదరగొట్టాడు. ముఖ్యంగా ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్ మ్యాచ్‌లో సిరాజ్ భారత్‌ను ఓటమి నుంచి కాపాడాడు. కాగా, ఐదో టెస్ట్‌లో 9 వికెట్లు పడగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అంతేకాక.. సిరీస్ మొత్తంలో 23 వికెట్లు తీసి.. టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా సిరాజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు మాజీలు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ బౌలర్ వసీం అక్రమ్ సిరాజ్‌ని ప్రశంసించారు.
‘‘సిరాజ్‌కు తపన, పట్టుదల ఎక్కువ. ఓవల్ టెస్ట్‌లో సిరాజ్ (Mohammed Siraj) అద్భుతం చేశాడు. ఐదు టెస్టుల్లో కలిపి 186 ఓవర్లు బౌలింగ్ చేసి.. ఆఖరి రోజు వరకూ అదే ఉత్సాహంతో ఉండటం సామాన్యమైన విషయం కాదు. సిరాజ్ ఇకపై కేవలం సపోర్ట్ బౌలర్ కాదు. బుమ్రా లేని సమయంలో అతను భారత్ పేస్ ఎటాక్ ఓపెన్ చేస్తున్నాడు. ఐదో టెస్ట్‌లో బ్రూక్ క్యాచ్ వదిలేసినప్పటికీ.. సిరాజ్ ఏకాగ్రత కోల్పోలేదు. అది ఒక పోరాడ యోధుడి లక్షణం. నేను పనిలో ఉన్నప్పుడు క్రికెట్ పెద్దగా చూడను. కానీ, ఆఖరి రోజు ఆట చూసేందుకు మాత్రం టివికి అతుక్కుపోయాను’’ అని అక్రమ్ ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.