ఎలాంటి అనుమతులు
లేకుండా సాగర్
కుడికాలువకు 500
క్యూసెక్కుల నీరు
విడుదల
ఏకపక్షంగా
ఆంధ్రప్రదేశ్
అధికారుల నిర్ణయం
భగ్గుమన్న తెలంగాణ
కృష్ణా రివర్ బోర్డుకు
ఫిర్యాదు
మన తెలంగాణ/హైదరాబాద్/హాలియా : ఎపి ప్రభుత్వం నాగార్జునసాగర్ కుడికాలువ కాలువ నుంచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంపై తెలంగాణ అధికారులు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(కెఆర్‌ఎంబి)కి ఫిర్యాదు చేశారు. ముందస్తు అనుమతులు లే కుండా తెలంగాణ అధికారులకు సమాచారం ఇవ్వకుండా నీటిని వి డుదల చేయడం జలచౌర్యం కిందికే వస్తుందని నాగార్జునసాగర్‌లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎపి ప్రభుత్వం ఏకపక్షంగా కుడికాలువ నుంచి నీటిని విడుదల చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ నాగార్జునసాగర్ ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్‌ఇ) మల్లికార్జున రా వు ఉన్నతాధికారుల అనుమతితో కెఆర్‌ఎంబికి ఫిర్యాదు చేశారు. అ నుమతులు లేకుండా ఏకపక్షంగా ఎపి అధికారులు వ్యవహరించార ని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు భారీగా వ రద నీరు వచ్చి చేరుతోంది. దీంతో సాగర్‌లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు శ్రీశైలం డ్యాం నిర్వహణ ఆంధ్రాకు, నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణ తెలంగాణకు అప్పగించారు.
2023 నవంబర్ 30న ఆంధ్రా అధికారులు సాగర్ డ్యాం పైకి పోలీస్ బలగాలతో ప్రవేశించి 13వ గేట్ నుండి 26వ గేట్ వరకు తమ అధీనంలోకి తీసుకుంటూ, కుడికాల్వ నిర్వహణను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆంధ్రా అధికారులు తమకు కావాల్సినప్పుడు, కేఆర్‌ఎంబీ సూచనలు కూడా పాటించకుండా కుడికాల్వకు నీటి విడుదలను చేపడుతూ వస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయిలో నిండకముందే పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపును ప్రారంభించిన ఏపీ సర్కార్. తాజాగా నాగార్జున సాగర్ విషయంలోనే అలాగే వ్యవహరిస్తున్నది. చెప్పాపెట్టకుండా సాగర్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేసుకున్నది. కేఆర్‌ఎంబీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా బుధవారం సాయంత్రం నుంచి నీటిని అక్రమంగా తరలిస్తున్నది. కుడి కాలువకు నీటి విడుదల విషయంలో ఏపీ అధికారులు కేఆర్‌ఎంబీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, సమాచారం ఇవ్వకుండానే బుధవారం సాయంత్రం నీటిని విడుదల చేశారని ఎన్‌ఎస్‌పీ ఎస్పీ మల్లికార్జున రావు అన్నారు.అయితే కెఆర్‌ఎంబి అదేశాల మేరకే సాగర్ కుడికాలువ మూడో గేటు నుంచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఎపి అధికారులు వివరించారు.