Thursday, July 3, 2025

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/జ్యోతినగర్: త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్ కోరారు. బుధవారం ఎన్టీపీసీ కాజిపల్లిలో గల ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు అస్మితుల్లా హుస్సేన్, సంగీతం శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్‌సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి విసృ్తతంగా ప్రచారం చేయాలని కోరారు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త సమష్టిగా ఉంటూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నియోజకవర్గ ప్రజలకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఇందిరమ్మ ఇల్లు లాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్, రైతు భరోసా లాంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను గడపగడపకు వెళ్లి ప్రచారం చేస్తూ రాబోయే ఎన్నికల్లో ధైర్యంగా ఓటు అడగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, పెద్దల్లి ప్రకాష్, కొలిపాక సుజాత, బొంతల రాజేష్, తిప్పారపు శ్రీనివాస్, మారెల్లి రాజిరెడ్డి, ఓదెలు, కొలని కవిత రెడ్డి, ఆసిఫ్, రహీం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News