Tuesday, May 13, 2025

డిఎస్పిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హయత్‌నగర్: సూర్యాపేట(Suryapet) డిఎస్పి పార్థసారధి ఇంట్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. సోమవారం సూర్యాపేట ఎస్‌ఐతో కలిసి రూ.16 లక్షలు లంచం తీసుకుంటూ డిఎస్పి(DSP) పార్థసారధి ఎసిబికి చిక్కారు. కేసు దర్యాప్తులో భాగంగా హయత్‌నగర్‌లోని పార్థసారధి ఇంట్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో రూ.కోటి విలువైన స్థిరాస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక.. 21 తుటాలు, 69 ఖాళీ క్యాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎసిబి అధికారుల ఫిర్యాదుతో పార్థసారధిపై ఆయుధాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పార్థసారధితో పాటు, ఎస్‌ఐ వీర రాఘవులుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు ఇద్దరికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. దీంతో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News