Sunday, August 31, 2025

వార ఫలాలు (31-08-2025 నుండి 06-09-2025 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం:   మేష రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఉద్యోగంలో స్థాన చలనం  ఏర్పడుతుంది.గృహంలో  శుభకార్యాలు నిర్వహిస్తారు. ఏలిన నాటి శని కాలంలో కొంతమందికి అద్భుతమైన ఫలితాలు వస్తే మరికొంతమందికి నిరాశ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. నూతన వస్తులాభాలు అందుకుంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.  నిరుద్యోగులకు నూతన  అవకాశాలు అందుతాయి. సంతానం యొక్క అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రతిరోజు కూడా నుదుటన నాగ సింధూరం ధరించండి ఆరావళి కుంకుమతో అమ్మవారిని పూజించండి.  అలాగే ఓం నమో నారాయణ వత్తులతో ప్రతిరోజు దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కోపతాపాలకు వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత లాభపడతారు. జీవిత భాగస్వామితో అకారణ వివాదాలు కలుగుతాయి. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. సినీ కళా రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది నూతన అవకాశాలు లభిస్తాయి.  ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలొ గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్థులకు అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు._చేజారిపోయిన అవకాశాలు తిరిగి మీ చేతికి అందుతాయి. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. ప్రతిరోజు కూడా శని గ్రహా స్తోత్రం పఠించండి. రుద్ర పాశుపత హోమం చేయించడం వలన కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారం యొక్క అభివృద్ధి మీరు ఆశించిన విధంగా ఉంటుంది. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. గ్యాస్ట్రిక్, స్కిన్ ఎలర్జీలు ముఖ్యంగా ఇబ్బంది పెడతాయి. ప్రతిరోజు నుదుటన నాగ సింధూరం ధరించండి. లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఎల్లో.

మిథునం:  మిధున రాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. భాగ్యంలో రాహు ఉన్న కారణం చేత తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం అలాగే ఉద్యోగ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కెరియర్ పరంగా బాగుంటుంది. కొంతమంది విషయంలో ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కొనసాగించాలా వద్దా అనే సందిగ్ధత ఏర్పడుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఉద్యోగ మారకుండా చేస్తున్న ఉద్యోగాన్ని కొనసాగించడం మంచిది. సాధ్యమైనంత వరకు దుబార ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. పొదుపు పైన దృష్టి పెట్టండి. ఎప్పటినుండో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదురుతుంది. జాతక పొంతనాలు చూసుకుని ముందుకు వెళ్లడం మంచిది. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుండి విమర్శలు  తప్పకపోవచ్చు. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. 8 మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య  5 కలిసి వచ్చే రంగు గ్రీన్.

కర్కాటకం :  కర్కాటక రాశి వారికి  ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం విషయంలో మరియు పిల్లల చదువుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కెరియర్ పరంగా బాగుంటుంది. మానసికంగా మాత్రం ఏదో లోటు ఉన్నట్టు అనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ధన  పరంగా ఇబ్బందులు తప్పవు. టెక్నికల్ రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో  పూర్తికాక చికాకు పరుస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి నూతన పెట్టుబడులు పెట్టడానికి ఆలోచన చేస్తారు.  వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. దూర ప్రయాణాలలొ వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 3 కలిసి వచ్చే రంగు తెలుపు.

సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం లాభాల బాటలో నడుస్తుంది. కెరియర్ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు  వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాల కంటే కూడా మీరు సొంతంగా చేసుకునే వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చి పరిస్థితి గోచరిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత జాప్యం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు. మీకు వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ఉపయోగించుకోండి. ప్రతిరోజు కూడా నువ్వుల నూనెతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. అఘోర పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.

కన్య:    కన్య రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కెరియర్ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఉద్యోగ పరంగా స్థిరత్వం లభిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ప్రభుత్వ పరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ రాయితీలు, చేతికి అందుతాయి. ఆత్మవిశ్వాసంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ పరంగా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు ఆహార నియమాలు పాటించాలి. జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. హోటల్ రంగంలో ఉన్నవారికి లాభాలు అంతంతమాత్రంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. మీ జీవితాశయం నెరవేరుతుంది. ప్రభుత్వ ఉద్యోగం చేయాలని మీ కోరిక నెరవేరుతుంది. విదేశీ సంబంధిత విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యా 9 కలిసి వచ్చే రంగు బ్లూ.

తుల:  తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా రావలసినటువంటి బెనిఫిట్స్ చేతికి వస్తాయి. సంతానం యొక్క అభివృద్ధి మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది. భూమి అమ్మి అప్పులు తీర్చాలని ప్రయత్నం చేస్తారు. క్రయవిక్రయాలు లాబిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బాగుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. నూతన ప్రాజెక్టును ప్రారంభించగలుగుతారు. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. రాజకీయరంగంలో ఉన్నవారికి ఉన్నత పదవి లభిస్తుంది. వ్యాపారాన్ని మంచి అభివృద్ధి స్థాయికి తీసుకువస్తారు. నూతన వ్యాపారాల ప్రారంభానికి ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. పర్సనల్ లోన్లకి క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండటం అనేది చెప్పేదగిన విషయం. ప్రేమ వివాహాలు కలిసి రావు ప్రేమ వివాహాలకు దూరంగా ఉండండి. ఇది కొంత మందికి మాత్రమే. నలుగురిలో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయండి. మంగళవారం రోజున హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు మెరూన్.

వృశ్చికం:  వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. ఇంటా బయట వివాదాలు కొంత చికాకు కలిగిస్తాయి. సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతోకానీ పూర్తి కావు.  ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉంటాయి. సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. వృధా  ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారం లాభాల బాటలో ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు శ్రమ అధికమవుతుంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలని  కల నెరవేరుతుంది. సినీ కళా రంగంలో ఉన్న వారికి అంతంతమాత్రంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే ఫలితాలు అంత బాగుంటాయి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

ధనస్సు:    ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు మాత్రం ఉంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అత్యవసరమైతేనే దూర ప్రయాణాలు చేయండి. ఉద్యోగంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఒత్తిడి అధికంగా ఉంటుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.  స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం పట్ల కొన్ని మెలకువలు అవసరం. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. అవసరానికి కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం అందుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తుంది. శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు తెలుపు.

Read Also: ప్రేమికుడి కోసం పారిపోయింది… కానీ మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న ప్రియురాలు

మకరం:   మకర రాశి వారికి ఈ  వారం  అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఇబ్బందులు లేనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీరు ఆశించిన స్థాయి ఉద్యోగం కాకపోయినప్పటికీ మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రతి పనిలో కూడా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగాలు,  బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పోటీ పరీక్షలు పాల్గొంటారు విజయం సాధిస్తారు. గణపతి స్వామి వారిని గకారక అష్టోత్తరంతో గరికతో పూజ చేయండి. జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు గ్రే.

కుంభం:      కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఎప్పటినుండో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది.  దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుంది. ఆరోగ్య పరంగా మాత్రమే కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. కొన్ని విషయాలలో నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తొలగి పోతాయి. మానసిక అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం కానీ వినడం కాని చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శనికి తైలాభిషేకం చేయించడం, అఘోర పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 3 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.

మీనం: మీన రాశి వారికి ఈ వారం  చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా భూ సంబంధిత వ్యవహారాలు సానుకూల పడతాయి. క్రయ విక్రయాలు లాబిస్తాయి. ఇల్లు కానీ ఫ్లాటు కానీ బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా స్థిరత్వం సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు అవకాశములు దక్కుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. వ్యాపారాలు విస్తరిస్తారు  ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆహార నియమాలు పాటించాలి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సరికి రెండు కలిసి వచ్చే రంగు తెలుపు.

Rasi phalalu cheppandi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News