మేషం: మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ఆప్తుల నుండి అవసరానికి ధన సహకారం అందుతుంది. పాత ఋణాలు నుండి విముక్తి లభిస్తుంది. నూతన ఉత్సాహం కలిగి ఉంటారు. ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలని అనుకుంటారు. స్వయం కృషితో ముందుకు వెళ్లాలని భావన ఏర్పడుతుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టిన దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసే పనిలో కృషి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. నూతన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. జిల్లేడు వినాయకుడికి గకారక అష్టోత్తరంతో స్వామి వారిని పూజించండి. నరదిష్టి అధికంగా ఉంటుంది. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఎరుపు.
వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. చుట్టుపక్కల వారితో ఉన్న ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. కీలకమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు నలుగురి సలహాలు సూచనలు పాటించండి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. ఉద్యోగం మారకుండా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే కొనసాగడం మంచిది. ముఖ్యమైన పనులలో ఆత్మ విశ్వాసంతో పని చేసి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తులు కానీ బంగారం కానీ కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారంలో వచ్చిన లాభాలను పొదుపు చేస్తారు. జీవితభాగస్వామి సలహాలు సూచనలు పాటించండి. ఎంతో మేలు జరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. ఈ గణపతి నవరాత్రులలో వినాయకుడిని గకారక అష్టోత్తరంతో పూజ చేయండి. అలాగే జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీకున్న వాక్చాతుర్యంతో అందరినీ మెప్పించ గలుగుతారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు గ్రే.
మిథునం: మిధునరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కష్టే ఫలి అన్నట్లుగా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ప్రవేశం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఋణ ఒత్తిడీల నుండి బయటపడతారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారంలో వచ్చిన లాభాలకు తగ్గట్టుగానే ఖర్చులు కూడా ఉంటాయి. మీకున్న సహనం ఓర్పు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో ఆప్తులతో పాల్గొంటారు. సంతాన విద్యా సంబంధమైన విషయాలపై దృష్టి పెడతారు. స్థిరాస్తి ఒప్పందాలు అతికష్టం మీద పూర్తవుతాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అంతంత మాత్రంగా ఉంటుంది. ఈ గణపతి నవరాత్రులలో ప్రతిరోజు కూడా వినాయకుడికి జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీరు చేపట్టిన పనులలో ఏర్పడినా ఆటంకాలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు గ్రీన్.
కర్కాటకం: కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పోటీ పరీక్షలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన విషయాలకు ధనం అధికంగా ఖర్చు అవుతుంది. కుటుంబ సభ్యులకు మీ అభిప్రాయాలు నచ్చవు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అంతంతమాత్రంగా ఉంటుంది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. గృహ నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థినీ విద్యార్థులకు విద్యాపరంగా బాగుంటుంది. పర్సనల్ లోన్లు విద్యా సంబంధమైన లోన్లు మంజూరు అవుతాయి. క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారం పరంగా లాభాలు తక్కువగా ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి రోజు కూడా వినాయకుడికి జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు తెలుపు.
సింహరాశి: సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాహు అంత అనుకూలంగా లేడు. భాగస్వామ్య వ్యాపారాలలో నష్టం వచ్చే విధంగా ఉంటుంది. ఆర్ధిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలిస్తాయి. జీవితభాగస్వామితో కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది కోపతాపాలకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారు. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహారిస్తారు. కొన్ని కొన్ని విషయాలలో సొంత నిర్ణయాలు పనిచేయవు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. వాహన యోగం ఉన్నది. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఉన్నతమైన పదవులు లభిస్తాయి. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య పరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఉంటాయి. కెరియర్ పరంగా స్థిరత్వం లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఈ గణపతి నవరాత్రులలో వినాయకుడికి ప్రతిరోజు కూడా గకారక అష్టోత్తరంతో జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్య: కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. శుభకార్యాల విషయంలో కూడా మంచి సంబంధం కుదురుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వివాహ ప్రయత్నం చేస్తున్నవారు వివాహ పొంతనలు చూసుకొని ముందుకు వెళ్లడం మంచిది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలనుండి ఉపశమనం లభిస్తుంది. ప్రభుత్వ పరంగా రావలసిన బెనిఫిట్స్ చేతికి అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులను అటుకులో ఉంచుకోవాలి. సంఘ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. గోశాలలో గరిక దానం చేయండి. ఈ గణపతి నవరాత్రులలో వినాయకుడిని గకారక అష్టోత్తరంతో, జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసి వచ్చే రంగు ఎల్లో.
తుల: తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. మంచి లాభాలను అందుకుంటారు. భవిష్యత్తు కోసం ధనాన్ని పొదుపు చేస్తారు. ముఖ్యమైన విషయాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఏర్పడతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండండి. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. గడిచిన రెండు వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుందని చెప్పవచ్చు. మానసికంగా ఒత్తిడికి లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. వైద్య వృత్తిలో ఉన్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. నూతన గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. ఈ గణపతి నవరాత్రులలో వినాయకుడిని గకారక అష్టోత్తరంతో గరికతో పూజించండి. అలాగే రోజు కూడా జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగంలో అనుకూలత పెరుగుతుంది. కోర్టు సంబంధమైన వ్యవహారాలలో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలలో రాణించ గలుగుతారు. నూతనవాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానానికి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులకు విద్యాపరంగా బాగుంటుంది. విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి విదేశీ యోగం లభిస్తుంది. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం విషయంలో జాతక పొంతనలు చూసుకుని ముందుకు వెళ్లడం మంచిది. ఈ గణపతి నవరాత్రులలో వినాయకుడిని గరికతో పూజించండి. ప్రతి రోజు కూడా జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు మెరూన్.
ధనస్సు: ధనస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గురు బలం బాగుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు రావాల్సిన ఫలితాలు నిదానంగా వస్తాయి. ప్రస్తుతం ఈ రాశి వారికి అర్థాష్టమ శని నడుస్తోంది. కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు. లీజులు లైసెన్సులు రెన్యువల్సు లాబిస్తాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. నూతన గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. సాధ్యమైనంతవరకు పొదుపుకి ప్రాధాన్యత ఇస్తారు. అవసరంలేని ఖర్చులను తగ్గించుకుం టారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైతేనే చేయండి. ఇతరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఈ గణపతి నవరాత్రులలో వినాయకుడికి గరికతో గకారక అష్టోత్తరంతో పూజ చేయండి అలాగే ప్రతిరోజు కూడా జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.
మకరం: మకరరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు ఆశించిన మార్పులు జరుగుతాయి. చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనవసర వస్తువులపై ధనం ఖర్చు చేస్తారు. కొన్ని అవకాశాలు చేతి వరకు వచ్చి చేజారిపోయే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. క్రయ విక్రయాలలో నష్టం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా లేదు. ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి. వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కొంత ఆలస్యం అవుతాయి. గణపతి నవరాత్రులలో గణపతిని గరికతో గకారక అష్టోత్తరంతో పూజించండి అలాగే ప్రతిరోజు కూడా జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు గ్రీన్.
కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాల వలన మీకు నష్టం వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో నష్టాలు అధికంగా ఉండే అవకాశం ఉంది. అజీర్తి గ్యాస్టిక్ సమస్యలు ఇబ్బంది పెడతాయి. స్కిన్ ఎలర్జీ కూడా ఇబ్బంది పెడతాయి. సంతాన విషయంలో కొంత వెలతి ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. పదిమంది సలహాలు సూచనలు వింటారు. కానీ మీకు నచ్చింది చేస్తారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఏర్పడతాయి. ప్రతిరోజు కూడా శనిగ్రహ స్తోత్రం చదవండి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఈ గణపతి నవరాత్రులలో గణపతిని గరికతో గకారక అష్టోత్తరంతో పూజించండి. అలాగే ప్రతిరోజు కూడా జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ.
మీనం: మీన రాశి వారికి ఈవారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. క్రయ విక్రయాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది. గృహ నిర్మాణ పనులు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఏర్పడతాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారికి కాస్త ఆలస్యం అవుతుంది. ధన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. హోటల్ రంగంలో ఉన్న వారికి కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. స్థిరాస్తులు పెరుగు తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఊహించనిరీతిలో ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.ఈ గణపతి నవరాత్రులలో ప్రతిరోజు కూడా గణపతి స్వామి వారిని గకారక అష్టోత్తరంతో గరికతో పూజించండి అలాగే ప్రతిరోజు కూడా జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తి స్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మీరు ఎప్పటినుండో ప్రయత్నం చేస్తున్న, మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభిస్తుంది. నలుగురిలో ప్రత్యేకంగా కనబడడానికి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు తెలుపు.