Sunday, June 15, 2025

వార ఫలాలు (15-06-2025 నుండి 21-06-2025 వరకు)

- Advertisement -
- Advertisement -

మేషం: మేష రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. రాచరాస్తులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా డుపుతారు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి దగ్గర వరకు వచ్చిన సంబంధాలు చేజారిపోయే పరిస్థితి గోచరిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. పిల్లల చదువుల కోసం అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండండి. రాజకీయరంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా లేదు. అనేక విషయాలలో సంయమనం పాటిస్తారు. మాటల కన్నా చేతులతోనే మీ పనితనాన్ని పించడానికి ఇష్టపడతారు.  కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. కళా రంగంలో ఉన్న వారికి సన్మానాలు సత్కారాలు జరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఈ రాశి వారు ముఖ్యంగా కుజునికి, శనికి సంబంధించిన పూజలు జపాలు, దానధర్మాలు చేసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు ఎల్లో.

వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పట్ల వ్యాపారం పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఆచితూచి వ్యవహరించాలి. ఇన్కమ్ టాక్స్ అధికారులతో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సహోదరి సోదరుల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళండి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పిల్లల చదువులకు ఖర్చులు అధికమవుతాయి. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం విషయంలో జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్లడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశి జన్మించిన స్త్రీలకు కాలం అనుకూలంగా ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. ఈ రాశి వారు ప్రతిరోజు దుర్గా స్తోత్రం చదవడం అనేది చెప్పదగిన సూచన. ప్రతిరోజు ఓం నమో శివాయ వత్తులతో దీపారాధన చేయడం ప్రతిరోజు కూడా హనుమాన్ సింధూరం ధరించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రీన్.

మిథునం: మిధున రాశి వారికి  వారం అనుకూలంగా ఉంది. వ్యాపార  రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. వానయోగం ఉంది. విద్యార్థిని విద్యార్థులకు పాలమనుకూలంగా ఉంది. సంతానం విద్యా విషయాలకు ఖర్చు అధికంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలని అనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు మేధా దక్షిణా మూర్తి స్తోత్రాన్ని చదవండి. రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా పరిస్థితి గోచరిస్తుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. అవసరమైతేనే దూర ప్రయాణాలు చేయండి. ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు తప్ప అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ప్రతిరోజు నుదుటన నాగ సింధూరం ధరించండి. ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు తెలుపు.

కర్కాటకం : కర్కాటక రాశి వారికి  మిశ్రమ ఫలితాలుగోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్ మార్కెట్ కి దూరంగా ఉండాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. కోపతాపాలకు దూరంగా ఉండండి. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. విద్యార్థిని విద్యార్థులకు మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది.నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం దురుతుంది. స్థిరస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార విస్తరణ చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అప్పు చేసి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడమే మంచిది. దానివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.  మొండి బాకీలు వసూలవుతాయి. అఘోర పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు ఎరుపు.

సింహరాశి :సింహ రాశి వారికి ఈ వారం సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఒకచోట స్థలం అమ్మి నూతన గృహం కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వాహనయోగం ఉన్నది. అత్యవసరమైతేనే దూర ప్రయాణాలు చేయండి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలలో ఉన్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వారికి అంతా అనుకూలంగా లేదు. నిరుద్యోగులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సాఫ్ట్వేర్ రంగంలోని వారికి కాలం అనుకూలంగా ఉంది. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఆశలు చిగురిస్తాయి. సినిమా రంగంలో ఉన్న వారికి అవకాశాలు బాగుంటాయి.  సన్నిహితుల నుండి  శుభవార్తలు అందుతాయి. వచ్చిన అవకాశాలను ఎంతవరకు ఉపయోగించుకుంటారు అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది.  ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రతి సోమవారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాలభైరవ రూపం మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.

కన్య:కన్యా రాశి వారికి  ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. దైవచింతన పెరుగుతుంది. సినిమా రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతలు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఖర్చుల  విషయంలో పునరాలోచన చేయడం మంచిది. సాఫ్ట్వేర్ అంగంలో ఉన్న వారికి అంతగా అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనుల్లో ఊహించని ఆటంకాలు కలుగుతాయి.  జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సంతానం యొక్క విద్యా విషయాలకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయులతో చిన్నపాటి విభేదాలు తప్పకపోవచ్చు. ఈ రాశి వారు అఘోర పాశుపత హోమం చేయించండి సుబ్రమణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు ఎల్లో.

 

తుల:తులారాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పెండింగ్ బిల్లులు వసూలు అవుతాయి. బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. వివాహాది శుభకార్యాలలో జాగ్రత్తలు తీసుకుంటారు మంచి సంబంధం కుదురుతుంది.  ముఖ్యమైన వ్యవహారాలు  నిదానంగా సాగుతాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి.  మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారంలో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. విద్యార్థిని విద్యార్థులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. సోమవారం రోజున శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు గ్రే.

వృశ్చికం:  వృశ్చిక రాశి వారికి ఈ  వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ధనం అధికంగా ఖర్చు అవుతుంది. నర దిష్టి అధికంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులలో చేస్తున్న ఉద్యోగం మారకపోవడం మంచిది. వృత్తిపరంగా ఉన్నటువంటి చిన్న చిన్న ఆటంకాలు తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పారాయణం చేయడం మంచిది. నిరుద్యోగులకు మీ చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్ కార్డు వీసా పాస్పోర్ట్ వంటి అంశాలు నత్త నడకన సాగుతాయి. ప్రతిరోజు అష్టమూలికా తైలంతో ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు ఎరుపు.

ధనస్సు:ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యాలు కొలిక్కి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మే వారికి బేకరీ వ్యాపారస్తులకు లాభాలు బాగుంటాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. దీర్ఘకాలిక  వివాదాలు పరిష్కారవుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా లేదు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతనపెట్టుబడులు పెట్టాలనుకునే వారు కొంతకాలం వేచి ఉండవలసిన సమయం. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం సంతాన ప్రాప్తికి సంబందించి శుభవార్తలు వింటారు.  సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంకె అయిదు కలిసి వచ్చే రంగు తెలుపు.

మకరం:మకర రాశి వారికి ఈ  వారం  వృత్తి ఉద్యోగాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపార పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారంలో అనుకోకుండా లాభనష్టాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య పరంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  నూతన వ్యాపారం ప్రారంబించాలనుకునే వాళ్ళు  ఉద్యోగం మారాలనుకునేవారు కొంత సమయం తీసుకోవడం  మంచిది.  భూములు అమ్మదల్చిన వారు కొనదలచిన వారు కొంత సమయం వేచి ఉండటం మంచిది.  ప్రస్తుత పరిస్తితులు అంత అనుకూలంగా లేవు.  వాహన ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  విదేశీ వ్యవహారాలు సక్రమంగా ఉన్నాయి విదేశాలలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది.  వెజ్ రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్  రంగంలో ఉన్న వారికి  అనుకూలంగా ఉంది.  సినిమా రంగంలో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు.  తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది.  వచ్చిన అవకాశాలు  చేజారే అవకాశాలు ఉన్నాయి.  అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఉన్న వారికి చాలా చక్కగా ఉంది.  విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి అవకాశాలు కలిసి వస్తాయి.  అలాగే భార్యాభర్తల మధ్య చిన్న విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

కావున తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి ఏ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి.  వృధా ఖర్చులు చేసుకోకుండా  వీలైనంతవరకు డబ్బులు పొదుపు చేసుకోండి. షేర్ మార్కెట్లో గాని చిట్టి లలో గాని ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నాలు మానుకోండి.  విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ప్రేమ వివాహాలకు కొంచెం దూరంగా ఉండటం మంచిది.  ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి.  సరైన సమయానికి నిద్ర ఆహారం తీసుకోండి.  అంతా నా కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు లభిస్తాయి.  బంధుమిత్రులతో కానీ స్నేహితులతో కానీ మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.  రాశిలో జన్మించిన వారు అఘోర పాశుపత హోమం చేయించడం మంచిది 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం మంచిది వీరికి ఏలినాటి శని పూర్తయింది.జూలై నుంచి వీరికి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ప్రతిరోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపరాధన చేయడం మంచిది మంగళవారం నాడు రాహుకాల దీపం పెట్టడం అలాగే సాధ్యమైనంత వరకు శివనామ స్మరణ చేయటం మరియు కుల దైవం యొక్క నామస్మరణ 108 సార్లు చేయటం మంచిది. ఈ రాశిలో జన్మించిన  వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు.  కలిసి వచ్చే రంగు గ్రే ఏదైనా పనిమీద వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్లడం మంచిది.

కుంభం:కుంభ రాశి వారికి ఈ వారం  సానుకూల పరిస్థితులు గోచరించడం లేదు జీవిత భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కావున తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి కోపం అధికంగా ఉంటుంది తగ్గించుకుంటే మంచిది. సాధ్యమైనంత వరకు సామరస్యంగా ఉండే ప్రయత్నం చేయండి. వ్యాపారంకోసం చేసే ప్రయత్నాలు అంత అనుకూలంగా లేవు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటూ ఉన్న వ్యాపారాన్ని నిర్వర్తిస్తూ  ఎలాంటి పెట్టుబడులకు పోకుండా  ఉండడం అనేది చెప్పదగిన సూచన. అలాగే ఆరోగ్య పరంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి స్పైనస్ కు సంబంధించి మోకాళ్ల నొప్పులు,  కీళ్ల నొప్పులు  ,లివర్ మరియు చర్మానికి సంబంధించిన ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  గ్యాస్ట్రిక్ మరియు ఎసిడిటీకి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  ఉన్న ఉద్యోగం కానీ వచ్చిన ఉద్యోగం కానీ కాదని వేరే నిర్ణయాలు తీసుకోవడం తగదు.  మూడు నెలల వరకు ఉద్యోగ మార్పు గురించి కానీ నూతన ఉద్యోగాల గురించి కానీ ప్రయత్నం చేయకపోవడం మంచిది.  భూమి మీద బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్లకు అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ వాళ్లకు అంత అనుకూలంగా లేదు కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు.  బంధుమిత్రులతోటి, సహోద్యోగులతోటి, జీవిత భాగస్వామి తోటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  ఆచితూచి మాట్లాడటం మంచిది సంతానం పట్ల చిన్నచిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏదైనా సౌమ్యంగా ఉండటం మంచిది. ఈ రాశిలో జన్మించిన విద్యార్ధి  విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది.  విదేశంలో చదువుకున్న వారికి లోన్ మంజూరు అవుతుంది చెడుగా చెడు అలవాట్లకు దూరంగా ఉండటం  స్నేహతులను గుడ్డిగా నమ్మి మోసపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి.  ఏదైనా సరే పెద్దల సలహాలు సూచనలు పాటించడం మంచిది. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయటం మంగళవారం నాడు రాహుకాలం దీపం పెట్టటం మంచిది అలాగే అఘోర పాశుపత హోమం చేయడం మంచిది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఇంట్లో వాళ్ల  పట్లసంతానం  పట్ల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చేసరికి 5 వచ్చే రంగు స్కై బ్లూ.

మీనం: మీన రాశి వారికి ఈ వారం  చాలా అనుకూలంగా ఉందిఉద్యోగాల పట్ల చాలా బాగుంది ఆరోగ్య విషయంలో కూడా చాలా బాగుంది అయితే ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది.  రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఉద్యోగాలలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ గాని ప్రభుత్వ ఉద్యోగం కోసంప్రయత్నం చేస్తున్న వారికి గాని అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి రోజు దైవ నామస్మరణ  చేయడం అలాగే 8  శనివారాలు శని కి తైలాభిషేకం చేయడం,అలాగే మంగళవారం నాడు రాహుకాలంలో దీపం పెట్టడం చాలా మంచిది.  దూర ప్రయాణంలో తగు జాగ్రత్తలు వహించాలి. మంగళవారం నాడు శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయండి తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి  కోర్టు వ్యవహారాలు సానుకూల పడతాయి.  భూ క్రయ విక్రయాల వ్యవహారాలు ఈ వారం ఒక కొలిక్కి  వచ్చే అవకాశం కనిపిస్తుంది.  సంతానం యొక్క  చదువు పట్ల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల్ని సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం మంచిది.  ఈ రాశిలోని విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి  చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి జీవిత భాగస్వామి యొక్క సలహాలను పాటించండి. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అలాగే నూతన విద్యా కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఫలితాలు లభిస్తాయి.  ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది.  వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు, మంచి సంబంధం కుదురుతుంది  సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.  ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తున్నది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయటం అఘోర పాశుపత హోమం చేయడం మంచిది.  ఉదర సంబంధ వ్యాధులకు సంబంధించి చర్మ సంబంధ వ్యాధులు  మరియు కళ్లకు సంబంధించిన ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.  రోజు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం మంచిది. గాయత్రి మంత్రం మరియు సుబ్రహ్మణ్యస్వామి అష్టోత్తరం పాటించడం మంచిది.   ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు ఎరుపు.

Rasi phalalu cheppandi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News