Tuesday, May 6, 2025

సిబిఐ తరువాతి చీఫ్ ఎవరు?

- Advertisement -
- Advertisement -

త్రిసభ్య ప్యానల్ కీలక భేటీ
రాహుల్, సిజెఐ హాజరు
త్వరలోనే ఎంపిక ప్రక్రియ

న్యూఢిల్లీ : తదుపరి సిబిఐ డైరెక్టర్ ఎంపిక కోసం ఉన్నత స్థాయిలో సోమవారం సమావేశం జరిగింది. ప్రదాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సంబంధిత ఎంపిక కమిటీ భేటీ జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. ప్యానెల్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా సభ్యులుగా ఉన్నారు. స్థానికంగా ప్రదాన మంత్రి కార్యాలయంలో (పిఎంఒ)లో ఈ ఎంపిక ప్రక్రియ వేగవంతం అయింది.

ఇప్పుడు సిబిఐ సంచాలకులుగా ఉన్న ప్రవీణ్ సూద్ పదవీకాలం మే 25వ తేదీతో ముగుస్తుంది. ఆయన కర్నాటక కేడర్ ఐపిఎస్ అధికారి.సిబిఐ బాధ్యతల్లోకి రాకముందు కర్నాటక డిజిపిగా ఉన్నారు. 2023 మే 25వ తేదీన సిబిఐ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. సాధారణంగా సిబిఐ సంచాలకుల ఎంపిక పూర్తిగా ప్రధాని నాయకత్వపు త్రిసభ్య కమిటీ సారధ్యంలో జరుగుతుంది. ప్రతిపక్ష నేత, సిజెఐ ఇతర సభ్యులుగా ఉంటారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన , సభ్యుల ఆమోదం తరువాత నియామక ప్రక్రియ ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News