Tuesday, July 8, 2025

తేలిపోయిన నాయర్

- Advertisement -
- Advertisement -

లీడ్స్: సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా టెస్టు జట్టులో స్థానం సంపాదించిన కరుణ్ నాయర్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కూడా నిరాశ పరిచాడు. సెలెక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టలేక పోయాడు. ఇంగ్లండ్‌తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో కరుణ్ నాయర్‌పై టీమిండియా భారీ ఆశలు పెట్టుకుంది. అతను మాత్రం తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోయాడు.

మొదటి ఇన్నింగ్స్‌లో కరుణ్ నాయర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. రెండో ఇన్నింగ్స్‌లోనైనా భారీ ఇన్నింగ్స్ ఆడతాడని అందరూ భావించారు. కానీ అతను మాత్రం ఈసారి కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఎలాంటి ఒత్తిడిలేని సమయంలో కూడా బ్యాట్‌తో రాణించలేక పోయాడు. రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరుస్తాడని భావించిన వారికి నిరాశే మిగిలింది. జట్టుకు అండగా నిలువాల్సిన నాయర్ 20 పరుగులు మాత్రమే చేసి పెవిలియర్ చేరాడు.

సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తదితరులు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో నాయర్‌కు ఇంగ్లండ్ సిరీస్‌లో చోటు దక్కింది. కానీ అతను మాత్రం ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోలేక పోయాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కూడా విఫలమై జట్టులో స్థానాన్ని ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు. ఇక యువ ఆటగాడు సాయి సుదర్శన్ కూడా మొదటి టెస్టులో నిరాశ పరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా 30 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News