Thursday, August 14, 2025

చివరి వన్డేలో పాక్ చిత్తు…. వెస్టిండీస్‌కు సిరీస్

- Advertisement -
- Advertisement -

 

ట్రినిడాడ్: పాకిస్థాన్‌తో జరిగిన మూడో, చివరి వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్ 202 పరుగుల తేడా తో రికార్డు విజయం సాధించింది. ఈ గెలుపు తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 21తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 294 పరుగుల భారీ స్కోరును సాధించింది. కెప్టెన్ షాయ్ హోప్ అజేయ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 29.2 ఓవర్లలో కేవలం 92 పరుగులకే కుప్పకూలింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన పాక్‌ను విండీస్ బౌలర్ జెడేన్ సీల్స్ హడలెత్తించాడు.

అతని ధాటికి తట్టుకోలేక విండీస్ వందలోపే చాపచుట్టేసింది. ఓపెనర్లు సైమ్ అయుబ్, అబ్దుల్లా షఫిక్‌లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ కూడా సున్నాకే ఔటయ్యాడు. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (9) కూడా నిరాశ పరిచాడు. ఈ నాలుగు వికెట్లు కూడా సీల్స్‌కే దక్కడం విశేషం. పాక్ టీమ్‌లో సల్మాన్ ఆఘా (30), మహ్మద్ నవాజ్ (23) నాటౌట్, హసన్ నవాజ్ (13) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. మిగతావారు సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు. వీరిలో ఐదు బ్యాటర్లు కనీసం ఖాతా కూడా తెరవకుండానే పెవిలియన్ చేరారు. దీన్ని బట్టి పాక్ బ్యాటింగ్ ఎంత అధ్వాన్నంగా సాగిందో ఊహించుకోవచ్చు. విండీస్ బౌలర్లలో జెడేన్ సీల్స్ 7.2 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లను పడగొట్టాడు.

హోప్ అజేయ శతకం..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్‌ను షాయ్ హోప్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. 68 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న జట్టుకు హోప్ అండగా నిలిచాడు. పాక్ బౌలర్లు దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. అతనికి కిసి కార్టి (17),రూథర్‌ఫోర్ట్ (15), రోస్టన్ ఛేజ్ (36) అండగా నిలిచారు. వీరి సహకారంతో హోప్ తన పోరాటాన్ని కొనసాగించాడు. చెలరేగి ఆడిన హోప్ 94 బంతుల్లోనే 10 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జస్టిన్ గ్రీవ్స్ 24 బంతుల్లో రెండు సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 43 పరుగులు చేసి తనవంతు సహకారం అందించాడు. మరోవైపు 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌పై వన్డే సిరీస్ గెలవడం విండీస్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News