Sunday, July 27, 2025

సన్‌రైజర్స్ టీమ్‌లో ముల్డర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి తీసుకొంది. గాయపడిన బ్రైడన్ కార్స్ స్థానంలో ముల్డర్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ యాజమాన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఐపిఎల్ మెగా వేలం పాటలో ముల్డర్ అన్ సోల్డ్‌గా మిగిలిపోయాడు. అయితే కార్స్ గాయపడడంతో అతనికి అదృష్టం కలిసి వచ్చింది. రూ.75 లక్షల బేసిక్ ధరకు సన్‌రైజర్స్ ముల్డర్‌ను సొంతం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ముల్డర్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు 18 టెస్టులు, 25 వన్డేలు, మరో 11 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లలో సౌతాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 60 వికెట్లు, మరో 970 పరుగులు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News