Tuesday, July 8, 2025

400 స్కోర్‌ రికార్డును చేజేతులా దూరం చేసుకున్న సఫారీ కెప్టెన్

- Advertisement -
- Advertisement -

టెస్ట్ క్రికెట్‌లో 400 పరుగులు చేయడం అంటే అంత సులువైన విషయం కాదు. ఇప్పటివరకూ కేవలం వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ బ్రియన్ లారా మాత్రమే ఆ రికార్డును సాధించారు. అయితే ఈ రికార్డు సాధించే సువర్ణావకాశాన్ని సౌతాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్ (Wiaan Mulder) చేజేతులా దూరం చేసుకున్నాడు. జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంకా 33 (367 నాటౌట్) పరుగులు చేస్తే 400 స్కోర్ చేరుతాడు అనగా.. తానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.

వియాన్ ముల్డర్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంది క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టెస్ట్ క్రికెట్‌లో ఎప్పుడో కానీ ఇలాంటి అవకాశం రాదని.. చరిత్ర సృష్టించే ఛాన్స్‌ని ముల్డర్ మిస్ చేసుకున్నాడని.. ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు తన రికార్డు గురించి ఆలోచించకుండా జట్టు ప్రయోజనాలే ముఖ్యమనుకున్న ముల్డర్‌పై (Wiaan Mulder) ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే 400 పరుగుల రికార్డు చేజారినప్పటికీ.. పలు రికార్డులను ముల్డర్ బద్దలుకొట్టాడు.

విదేశీ టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా ముల్డర్ నిలిచాడు. ముల్డర్ ఈ మ్యాచ్‌లో 367 పరుగులు చేయగా.. ఆ తర్వాతి స్థానంలో పాకిస్థాన్‌కు చెందిన హనీఫ్ మొహమ్మద్ (337) ఉన్నాడు. అలాగే సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా ముల్డర్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు గ్రేమ్ స్మిత్ 362 పరుగులు (277, 85) పేరిట ఉండేది. అంతేకాక.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే త్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా.. టెస్టుల్లో సెకండ్ ఫాస్టెస్ట్ త్రిపుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా ముల్డర్ రికార్డు సాధించాడు. మొదటి స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్ 278 బంతుల్లో త్రిపుల్ సెంచరీ చేయగా.. ముల్డర్ 298 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News