Tuesday, September 9, 2025

వ్యాను-బైకు ఢీ.. దంపతులు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ఓ వ్యాను, బైకు ఢీకొన్న ఘటనలో భార్యభర్తలు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. మంగళవారం ఎర్రుపాలెం మండలంలోని తక్కెళ్లపాడు గ్రామం వద్ద అదుపతప్పి వ్యాను, బైకు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న దంపతులు తీవ్రంగా గాయపడి సంఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్తలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతర ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News