Saturday, May 3, 2025

జగిత్యాలలో దారుణం.. సంతానం లేదని భర్యకు ఉరి వేసి హత్య..

- Advertisement -
- Advertisement -

జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పిల్లలు పుట్టలేదని ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే..  మమత అనే మహిళకు మహేందర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే, కొన్నాళ్లుగా వరకట్నం కోసం వేధింపులకు గురిచేసిన భర్త, అత్తమామలు.. తర్వాత సంతానం లేదని చిత్రహింసలు పెట్టారు. ఈ క్రమంలో గత నెల 24న మహేందర్.. తన భార్య మమతకు ఉరి వేసి హత్య చేశాడు. తర్వాత తన భార్య కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో మహేందర్ ఇంట్లో నుండి దుర్వాసన రావటంతో స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లో కుళ్ళిన స్థితిలో ఉన్న మమత మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News