అన్యోన్యంగా ఉండాల్సిన భార్యాభర్తల మధ్య అకస్మాత్తుగా మనస్పర్ధలు వచ్చాయి. కలిసి ఉండకుండా వేరువేరుగా ఉంటున్నారు. భర్తపై కోపంతో భార్య కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి భర్త ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే.. రామంతపూర్ ప్రగతి నగర్ లో నివసిస్తున్న మెతుకుపల్లి రవీందర్ రెడ్డి కుమారుడు రిత్విక్ రెడ్డి అబ్దుల్లాపూర్మెట్ గండిచెరువుకు చెందిన రక్తం కృష్ణారెడ్డి కూతురు ఆకాంక్ష రెడ్డితో 2024 ఏప్రిల్ 21వ తేదీన వివాహం జరిగింది. కొద్ది రోజులు సంతోషంగా ఉన్న భార్యాభర్తల మధ్య అకస్మాత్తుగా మనస్పర్ధలు వచ్చాయి. కలివిడిగా ఉంటూ వేర్వేరుగా దూరంగా ఉంటున్నారు. పుట్టింటికి వెళ్ళిన ఆకాంక్ష రెడ్డి భర్త రిత్విక్ రెడ్డి పై అబండాలు మోపుతూ సంసారానికి పనికిరాడు అంటూ అసత్య ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య ఏర్పడిన సమస్యను పరిష్కరించడానికి కుటుంబ సభ్యులతో రామంతపూర్ ప్రగతి నగర్ లోని భర్త రిత్విక్ రెడ్డి చర్చల పేరుతో మాట్లాడుకుందామంటూ ఇంటికి వచ్చారు. సుమారు 100 మంది తో వచ్చిన వీరు ఇరువురు మధ్య మాట మాట పెరిగి దాడికి దారితీసింది.ఇంట్లోకి అక్రమంగా చొరబడి దాడి చేసి నిర్బంధించి రూ. 3 కోట్ల 50లక్షలు 4చెక్కుల పై బలవంతంగా సంతకాలు చేయించుకున్న భార్య ఆకాంక్ష రెడ్డి, తండ్రి కృష్ణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రిత్విక్ రెడ్డి తండ్రి రవీందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఆకాంక్ష రెడ్డి, తండ్రి రొక్కం కృష్ణారెడ్డి, సమీప బంధువు ఎల్బీనగర్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే, బిజెపి నాయకులు సామ రంగారెడ్డి మరికొందరిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధు తెలిపారు