చెన్నై: ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా కుప్పం పాళ్యంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుప్పంపాళ్యంలో భారత్(36), నందిని(26) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భారత్ చెన్నైలో ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నందిని ఇంటి దగ్గరే ఉంటూ కుమార్తెలను చూసుకుంటుంది. ఎదురింట్లో ఉండే సంజయ్(21) అనే యువకుడితో నందిని వివాహేతర సంబంధం పెట్టుకుంది.
ఈ విషయం భర్తకు తెలియడంతో పలుమార్లు భార్యను మందలించాడు. భారత్ తన భార్య, చిన్న కుమార్తెతో కలిసి బైక్ సరుకులు తీసుకరావాడానికి బయటకు వచ్చాడు. సరుకులు తీసుకొని ఇంటికి వెళ్తుండగా మార్గం మధ్యలో కొబ్బర మట్టలు అడ్డుపడడంతో బైక్ నుంచి ఇద్దరు కిందపడ్డారు. వెంటనే సంజయ్ కత్తి తీసుకొని భారత్ ను పలుమార్లు పొడిచాడు. అనంతరం ఘటనా స్థలం నుంచి సంజయ్ పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో నందిని పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు అనుమానం కలిగింది. మూడేళ్ల చిన్నారిని పోలీసులు అడిగారు. తన ఇంటి ఎదురుగా ఉండే సంజయ్ మామ తండ్రిని కొట్టి చంపి పారిపోయాడని తెలిపాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. వెంటనే నందినితోపాటు సంజయ్‌ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
- Advertisement -