Sunday, July 6, 2025

భర్తను గొంతుకోసి హతమార్చిన భార్య

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లా, బోధన్ మండలం, మానార్‌పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భర్తను అతికిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన భార్య ఘటన వెలుగుచూసింది. ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశ్యనాయక్ (57), ఆయన భార్య సాయిబాయి మధ్య వివాదం నెలకొంది. శుక్రవారం రాత్రి భార్యాభర్తల మధ్య మాటమాట పెరిగి భర్త ప్రాణాల మీదికి వచ్చింది. రాత్రి సమయంలో కేకలు వినిపించడంతో స్థానికులు హుటాహుటిన వారి ఇంటి వద్దకు చేరుకున్నారు. దేశ్యనాయక్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన అతనిని బోధన్ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ హత్యకు సంబంధించి మృతుడి భార్య సాయిబాయి, కుమారుడిపై అనుమానంతో అరెస్టు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్‌ఐ మచ్చేందర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News