చెన్నై: తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలోని ధర్మపురి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య సాంబార్‌లో విషం కలిసి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కీరైపట్టి గ్రామానికి చెందిన రసూల్(35)కు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. అతను ఓ ప్రైవేటు కంపెనీలు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే రసూల్ వాంతులు చేసుకొని స్పృహకోల్పోవడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ రక్త పరీక్షలు నిర్వహించగా.. అందులో పురుగుల మందు అవశేషాలు ఉన్నాయని గుర్తించారు.
దీంతో రసూల్ కుటుంబీకులు అతడి భార్యపై అనుమానంతో ఆమె వాట్సాప్ ఛాటంగ్‌ను పరిశీలంచారు. అందులో ఆమె లోకేశ్వరన్ అనే వ్యక్తితో ఛాటింగ్ చేసినట్లు గుర్తించారు. అందులో ‘‘నువ్వే ఇచ్చిన విషాన్ని దానిమ్మ రసంలో కలిపాను.. కానీ, దాన్ని నా భర్త తాగలేదు. దీంతో ఆహారంలో కలిపా’’ అని మెసేజ్‌ల్లో ఉంది. మరోవైపు చికిత్స పొందుతున్న రసూల్ తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు (Tamilnadu) కేసు నమోదు చేసి రసూల్ భార్య, లోకేశ్వరన్‌లను శనివారం అరెస్ట్ చేశారు.