Tuesday, September 16, 2025

భర్తపై వేడి నూనె పోసిన భార్య

- Advertisement -
- Advertisement -

జోగులాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండలం, మల్లెందొడ్డి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న భర్తపై భార్య వేడి నూనె పోసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాల్లోకి వెళ్తే…వెంకటేష్, పద్మకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ముగ్గురు సతానం. భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ నెల 11న నిద్రిస్తున్న భర్తపై పద్మను వేడి నూనె పోసింది. దీంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే గద్వాల ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో కర్నూల్ ఆస్పత్రికి పంపించారు. కాగా, చికిత్స పొందుతూ వెంకటేష్ సోమవారం మరణించాడు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు.

Also Read: త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తాం : మంత్రులు సీతక్క, సురేఖ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News