Sunday, June 15, 2025

సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ

- Advertisement -
- Advertisement -

కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి సక్సెస్ అందుకుంటాయని, హీరోలు అవసరం లేదని అన్నారు ప్రముఖ నటుడు శివాజీ రాజా. రేవు వంటి మంచి మూవీని నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ సంహిత్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో మరో ఆసక్తికరమైన మూవీ వైల్డ్ బ్రీత్‌ను యంగ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. ఈ చిత్రానికి హరినాథ్ పులి దర్శకత్వం వహిస్తున్నారు. డా.మురళీ చంద్ గింజుపల్లితో కలిసి పర్వతనేని రాంబాబు నిర్మిస్తున్నారు. వైల్డ్ బ్రీత్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు శివాజీ రాజా చేతుల మీదుగా లాంఛ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్ అతిథులుగా హాజరయ్యారు. పలువురు పాత్రికేయ మిత్రుల సమక్షంలో వైల్డ్ బ్రీత్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు శివాజీ రాజా (Shivaji Raja)మాట్లాడుతూ “వైల్డ్ బ్రీత్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బాగున్నాయి. దర్శకుడు హరినాథ్ పులి మంచి పేరు తెచ్చుకోవాలి”అని అన్నారు. నిర్మాత పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ “వైల్డ్ బ్రీత్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంటోంది. హరినాథ్ పులి దర్శకుడిగా ఈ చిత్రంతో తానేంటో నిరూపించుకుంటాడు”అని తెలిపారు. దర్శకుడు హరినాథ్ పులి మాట్లాడుతూ “వైల్డ్ బ్రీత్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. షూటింగ్ తుది దశలో ఉంది”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News