- Advertisement -
ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటానికి అమెరికా మద్దతు ఉంటుందని అగ్రరాజ్యం ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ వెల్లడించారు. భారత్ చేసే ప్రయత్నానికి సహాయం చేయడానికి అవసరమైన శక్తి, వనరులను అమెరికా అందిస్తుందని ఆయన అన్నారు. ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ చర్యలు చేపడుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్ సరిహద్దు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆయన ఆరోపించారు. “భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడాలి. ఆ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి మేము సాధ్యమైన సహాయం చేస్తాం. ఉగ్రవాదంపై పోరాడటానికి అమెరికా అండగా ఉంటుందని” అని జాన్సన్ చెప్పారు.
- Advertisement -