- Advertisement -
భారత్ తో ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ కు ప్రపంచ దేశాల నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదు. తాజాగా ప్రపంచ బ్యాంక్ పాకిస్తాన్ కు షాకిచ్చింది. గత నెల 22న జమ్ముకాశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ తో సిందూ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ క్రమంలో రెండు దేశాల మధ్య సమస్యను పరిష్కరించేందుకు ప్రపంచ బ్యాంక్ జోక్యం చేసుకునే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తా కథనాలు వైరల్ అయ్యాయి. దీంతో సిందూ నదీ జలాల ఒప్పందం రద్దుపై స్పందించిన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా.. తాము జోక్యం చేసుకోమని తెల్చే చెప్పారు. ఈ విషయంలో ప్రపంచ బ్యాంక్ పాత్ర ఒక సహాయకుడిగా మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
- Advertisement -