Friday, May 2, 2025

ఈవిఎంలతో ఎన్నికలు నిర్వహిస్తే పోటీ చేయను: రాచమల్లు

- Advertisement -
- Advertisement -

ప్రొద్దుటూరు: ఈవిఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే పోటీ  చేసినా ఫలితం ఉండదని, ఈసారి ఎన్నికల్లో మోసం జరిగినట్టే 2029 ఎన్నికల్లో కూడా మోసం జరుగుతుందని, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగితేనే స్వచ్ఛమైన ఫలితాలు వస్తాయని  వైసిపి అధికార ప్రతినిధి, మాజీ ఎంఎల్ఏ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు.

ఈవిఎం లపై ఎంతో మంది అనుమాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎన్నికల సంఘం స్పందించడం లేదని కూడా ఆయన విమర్శించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కూడా ఆయన కోరారు. టెక్నాలజీని ఉపయోగించుకుని, ఈవిఎం ల ద్వారా అప్రజాస్వామిక పద్ధతిలో నాయకులు ఎన్నికవుతున్నారని శివప్రసాద్ రెడ్డి విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News