Saturday, August 16, 2025

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: అడ్లూరి లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ధర్మపురిః జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఇటివల ఎన్నికైన ధర్మపురి ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు రాష్ట్ర మంత్రి అడ్లూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులు కొంక వరప్రసాద్, ఉపాధ్యక్షులు రెంటం శంకర్, వడ్లూరి రవిందర్‌లను మంత్రి లక్ష్మణ్ కుమార్ శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ప్రెస్‌క్లబ్ సభ్యులు పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువెల్లారు. ఎన్నో ఏళ్లుగా నాన్చుతున్న జర్నలిస్టుల ఇంటి స్థలాలు కేటాయింపు జరుపాల్సిందిగా పాత్రికేయుల కోరగా అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. తాను 2009 ధర్మపురి నియోజకవర్గ పునర్విభజన నాటి నుండి మిమ్మల్ని చూస్తున్నానని, తప్పకుండా జర్నలిస్టులకు న్యాయం చేస్తానని మంత్రి పాత్రికేయులకు హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు స్తంభంకాడి అశోక్, కోరుట్ల శ్రీరాములు, స్తంభంకాడి శ్రీనివాస్, రేణికుంట రమేష్, ఉత్తెం పెద్దన్న, ఆర్థి శ్రీకాంత్, రంగు శ్రీనివాస్, కొంక సుధీర్, కాశెట్టి రాంబాబు, చీర్ల రమేష్, కళ్యాడపు కుసుమ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News