Thursday, August 14, 2025

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే కూచుకుల్ల

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నాగర్ కర్నూల్ ప్రతినిధి: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుల్ల రాజేష్ రెడ్డి అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ జిల్లా కార్యవర్గ సమావేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులకు మంచి జరిగేలా ప్రయత్నం చేస్తానన్నారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిల జర్నలిస్టులు పని చేస్తున్నారని, వారి సేవలను కొనియాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హమీ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా పాత్ర అపూర్వమని ప్రశంసించారు. అంతకుముందు ఎమ్మెల్యేను శాలువా, పుష్ఫగుచ్ఛంతో టిడబ్లుఎంజె సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పుట్ట పాగా వెంకటస్వామి, సెక్రటరీ ప్రభాకర్, యూనియన్ జిల్లా అధ్యక్షులు విజయ్ గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు తరుణయ్య, శ్యాంసుందర్, కందికొండ మోహన్, రాష్ట్ర సాంస్కృతిక సలహాదారులు దినాకర్, టిఏఈఎంజె సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News