Monday, August 11, 2025

భారత్ తోపాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం: పాక్ ఆర్మీ చీఫ్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: మరోసారి భారత్ పై పాకిస్తాన్ అణు బెదిరింపులకు దిగింది. ఇటీవల భారత్-పాక్ మధ్య చోటుచేసుకున్న వివాదం తర్వాత రెండోసారి అమెరికాలో వెళ్లిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ భారత్ పై అణు బెదిరింపు వ్యాఖ్యలు చేశాడు.  భవిష్యత్తులో భారత్ నుండి తన దేశం ఉనికికి ముప్పును ఎదురైతే.. పాకిస్తాన్, భారత్ తోపాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని హెచ్చరించాడు.

అమెరికా పర్యటన సందర్భంగా టంపాలో పాకిస్తాన్ కాన్సుల్‌గా పనిచేస్తున్న వ్యాపారవేత్త అద్నాన్ అసద్ కోసం ఏర్పాటు చేసిన బ్లాక్-టై విందు కార్యక్రమంలో మునీర్ ఈ అణు బెదిరింపులు చేశాడు. “మనం ఒక అణ్వస్త్ర దేశం, మనం పతనమవుతున్నామని అనుకుంటే, మనతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాము. సింధు నదీపై భారత్ ఆనకట్ట నిర్మించే వరకు మేము వేచి ఉంటాం. ఆనకట్ట నిర్మిస్తే 10 క్షిపణులతో నాశనం చేస్తాం. సింధు నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదు” అని మునీర్ భారత్ పై విషం కక్కాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News