Thursday, September 4, 2025

ఎల్లుండి వైన్ షాపులు బంద్.. ఆదేశాలు జారీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఈ నెల 6వ తేదీన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని మద్యం షాపులను మూసివేయాలని పోలీస్ కమిషనర్లు సివి ఆనంద్, అవినాష్ మహంతి, సిపి సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 6గంటల వరకు మూసివేయాలని పేర్కొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసివేయాలని, స్టార్ హోటళ్లలో బార్లు, రిజిస్ట్రర్డ్ క్లబ్బులకు మినహాయింపు ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్లు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News