Saturday, July 26, 2025

రాజధాని నిర్మాణ పనులపై వైసిపి దుష్ప్రచారం నమ్మవద్దు: మంత్రి నారాయణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: అధికారుల నివాస సముదాయాలు మార్చి లోగా పూర్తవుతాయని ఎపి మంత్రి నారాయణ తెలిపారు. ఉద్యోగులకు ఆస్పత్రుల కోసం విట్, ఎస్ఆర్ తో ఎన్నో సంప్రదింపులు జరిపామని అన్నారు. అమరావతి రాజధానిని నారాయణ పర్యటించారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు, నేలపాడులోని గెజిటెట్, నాన్ గెజిటెట్ అధికారుల క్యార్టర్ల పనులను, గ్రూప్- డి అధికారుల నివాసాలు, హ్యాపీనెస్ట్ టవర్ల పనులను పరిశీలించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేలా కాంట్రాక్ట్ సంస్థలకు నారాయణ దిశానిర్దేశం చేశారు.

నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా నిర్మాణ సంస్థలకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..4 వేల మంది ఉద్యోగుల కోసం 100 పడకల ఆస్పత్రి, పాఠశాలలకు నిర్మాణ సంస్థలు అంగీకరించాయని తెలియజేశారు. రాజధాని పనులు జరగట్లేదని వైసిపి చేసే దుష్ప్రచారం నమ్మవద్దు అని సూచించారు. సింగపూర్ ప్రభుత్వంతో మైత్రి పునరుద్దరణకే సిఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పర్యటిస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News