Wednesday, September 3, 2025

అతిపెద్ద టీవీని ఆవిష్కరించిన వోబుల్ డిస్‌ప్లేస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇండియన్ టెక్నాలజీ బ్రాండ్ వోబుల్ డిస్‌ప్లేస్ చరిత్ర సృష్టించింది. భారత్‌లోనే అతిపెద్ద టెలివిజన్ అయిన ’మాక్సిమస్ సిరీస్’ 116.5- అంగుళాల గూగుల్ టీవీ 5.0ని మంగళవారం ఆవిష్కరించింది. అంతర్జాతీయ బ్రాండ్ ల ఆధిపత్యం ఉన్న మార్కెట్లో ఒక భారతీయ కంపెనీ ఈ ఘనత సాధించడం విశేషం. ఈ టీవీలో అత్యాధునిక క్యూఎల్‌ఇడి + మినీఎల్‌ఇడి డిస్‌ప్లే, 2000 నిట్స్ బ్రైట్‌నెస్, 240డబ్లు డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. గేమింగ్ కోసం ప్రత్యేకంగా 4కె 144హెట్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఇది భారతీయ గృహ వినోద రంగంలో ఒక కొత్త శకానికి నాంది అని కంపెనీ సిఇఒ ఆనంద్ దూబే తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News