Thursday, July 31, 2025

అల్‌ఖైదా మహిళా ఉగ్రవాది అరెస్టు

- Advertisement -
- Advertisement -

అల్ ఖైదా టెర్రర్ మాడ్యూల్ మాస్టర్ మైండ్‌ను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్కాడ్ పోలీసులు అరెస్టు చేశారు. అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ మాడ్యూల్ కీలక కుట్రదారు 30 ఏళ్ల షమా పర్వీన్‌ను కర్ణాటకలోని బెంగళూరులో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. దేశంలో ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న వారిని గుర్తించేందుకు అధికారులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగానే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. షమా పర్వీన్ రెండు ఫేస్‌బుక్ పేజీలను నిర్వహిస్తోందని, దాదాపు 10 వేల మంది ఫాలోవర్లున్న ఇన్‌స్టాగ్రామ్ పేజీ కూడా ఉందని, వీటిలో ఆమె భారత వ్యతిరేక మత బోధకుల రెచ్చగొట్టే ప్రసంగాలను వ్యాప్తి చేస్తోందని ఎటిఎస్ ఒక ప్రకటనలో తెలియజేసింది.

ఈ నెల 23న ఈ మాడ్యూల్‌తో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులను ఢిల్లీ, నోయిడాలో అరెస్టు చేశారు. వీరంతా ఒక ఆటో డిలీటెడ్ యాప్ ద్వారా సంప్రదింపులు జరుపుకునే వారని, దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ గ్రూపునకు సంబంధించిన సభ్యులున్నారని కూడా వారు తెలిపారు. వీరందరికీ షమా పర్వీన్ నాయకత్వం వహిస్తోందని, వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరపడానికి ప్లాన్ కూడా వేసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఈ గ్రూపునకు చెందిన ఇతర మద్దతుదారులు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరిపే వారి కోసం గాలింపు కొనసాగుతుందని కూడా వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News