తన పుట్టిన రోజున అంటే సెప్టెంబర్ 5 శుక్రవారం నాడు తనకు పరిచయస్తులైన ఇద్దరు తనపై అత్యాచారం చేశారని హరిదేవ్ పూర్ కు చెందిన 20 ఏళ్ల మహిళ ఆరోపించింది. చందన్ మాలిక్, ద్విప్ బిస్వాస్ ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణ ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి నిందితులు బాధితిరాలిని రీజెంట్ పార్క్ ప్రాంతంలోని ఒక ప్లాట్ కు తీసుకువెళ్లారు. ఆమె తన పుట్టినరోజు అని చెప్పడంతో వారు కలిసి భోంచేశారు. తర్వాత ఆమె ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా, తలుపులు లాక్ చేసి తనపై అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. మర్నాడు ఉదయం ఆమె తప్పించుకుని ఇంటికి చేరిన తర్వాత హరిదేవ్ పూర్ పోలీసు స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.
ఎఫ్ ఐ ఆర్ ప్రకారం చందన్ మల్లిక్ అనే నిందితుడు ఆ మహిళను మలంచ దగ్గరలోని మరో నిందితుడి ద్వీప్ విశ్వాస్ ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరూ ఆమెపై అత్యాచారం చేశారని ఆమె ఆరోపించిందని హరిదేవ్ పూర్ పోలీసు అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అప్పటి నుంచీ వారు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారి ఆచూకీ తెలిస్తే చెప్పాలని స్థానికులను కూడా హెచ్చరించారు. ఈ ఏడాది జూన్ లో 24 ఏళ్ల లా స్టూడెంట్ పై సౌత్ కలకత్తా లా కాలేజీ క్యాంపస్ లో ముగ్గురు విద్యార్థులు, సెక్యూరిటీ గార్డు గ్యాగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆ సంఘటన తర్వాత నగరంలో మహిళల భద్రత పై పెద్దఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి.