Friday, August 22, 2025

నాలాలో మహిళ మృతదేహం లభ్యం

- Advertisement -
- Advertisement -

నాలలో మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం లింగంపల్లి నాలలో మహిళ మృతదేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పైకీతీసి పరిశీలించి ఆరా తీయగా లింగంపల్లి గ్రామానికి చెందిన యాదమ్మ (55) గుర్తించారు. ఆమె జిహెచ్‌ఎంసిలో శానిటేషన్‌లో స్వీపర్‌గా పనిచేస్తుంది. మహిళ వద్ద పర్స్ లభించగా అందులో బంగారు కమ్మలు, ఒక బ్రాస్‌లెట్, ఫోన్ నెంబర్ లభించాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News