Wednesday, September 3, 2025

మహిళ దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

గుర్తు తెలియని దుండగులు మహిళను దారుణంగా హతమార్చి నిర్మాణుష్య ప్రదేశంలో పడేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్‌ఐ సతీష్, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మండలంలోని ఉల్లేపల్లి గ్రామానికి చెందిన బంటు వెంకటమ్మ (55) వ్యవసాయ కూలీలకు మేస్త్రీగా పని చేస్తుంది. ఆమెకు భర్త, ఓ కుమార్తె, కుమారుడు కలరు. సోమవారం ఉదయం పని మీద వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మంగళవారం మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం గ్రామం నుంచి జల్లెపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో విగతజీవిగా పడి ఉండటంతో గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. కాగా మృతదేహంపై కత్తి గాయాలు, గొంతు నులిమిన ఆనవాళ్లు ఉండగా ఘటనా స్ధలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. కుమారుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News