సంగారెడ్డి జిల్లా, న్యాల్‌కల్ మండలం, రుక్మాపూర్‌లో దారుణం జరిగింది. అల్లాదుర్గ్, మె టల్‌కుంట రహదారిపై ఉన్న గ్రామంలో ఆదివా రం అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. ఆమెపై దాడి చేసి బంగారు నగలు, నగదును దోచుకొని గొంతు నులిమి హత్య చేశారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామానికి చెందిన బోరంచ రాణెమ్మ(46) తన తల్లి బిచ్చమ్మతో కలిసి ఉంటోంది. రాణెమ్మకు ఒక కూతురు ఉండగా ఆమెను మండల పరిధిలోని గుంజెట్టి గ్రామానికి పెండ్లిచేసి పంపింది. రాణె మ్మ తల్లి మరోకూతురు దగ్గరకు వెళ్లడంతో ఆ దివారం రాత్రి ఆమె ఒంటరిగా ఇంట్లో ఉండా ల్సి వచ్చింది. పడుకునే ముందు కూడా గుం జెట్టిలో ఉన్న కూతురుతో మట్లాడిన రాణెమ్మ సోమవారం తెల్లవారుజామున ఇంట్లోని మం చంపై శవమై కనపడింది.
గ్రామస్థులు ఈ విషయాన్ని హద్నూర్ పోలీసులకు తెలపడంతో హూటాహూటిన జమీరాబాద్ రూరల్ సిఐ జక్కుల హనుమంతు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను, స్థానికులను విచారించి విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. సంగారెడ్డి ్డనుండి క్లూస్ టీంతోపాటు జాగిలంను రప్పించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. జాగిలం ఘటనా స్థలం నుండి అల్లాదుర్గ్ మెటల్‌కుంట రోడ్డు వద్దకు వచ్చి తిరిగి వెళ్లింది. సంఘటనా స్థలానికి హద్నూర్ పోలీసులే కాకుండా రాయికోడ్, ఝరాసంఘం పోలీసులు కూడా వచ్చి క్లూస్ టీంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్య కేసును త్వరలో ఛేదించి దుండగులను అదుపులోకి తీసుకుంటామని జహీరాబాద్ రూరల్ సిఐ జక్కుల హనుమంతు అన్నారు.