- Advertisement -
నిజామాబాద్ జిల్లా, బోధన్ మండలం, పెంటాఖుర్దు గ్రామంలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. చంద్రకళ (59) అనే మహిళను దారుణంగా హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న నగలను అపహరించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతురాలి చిన్న కుమారుడు సురేష్‌పై అనుమానంతో అతడిని బోధన్ రూరల్ ఠాణాకు తరలించి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
- Advertisement -