Home జాతీయ వార్తలు మహిళ ఆత్మహత్య

మహిళ ఆత్మహత్య

SUICIDEభవానీపురం : ఎపిలోని భవానీపురంలో దారుణం చోటు చేసుకుంది. అత్తింటివారి వేధింపులు భరించలేక షేక్‌హష్మ అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు తన ఆవేదనను సెల్ఫీ ద్వారా వెలిబుచ్చింది. అత్త, మామ, ఆడపడుచుల వేధింపులను భరించలేకపోతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపింది. చనిపోయే ముందు తన చిన్నారుల భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నట్టు పేర్కొంది. వీడియో ఆధారంగా భవానీపురం పోలీసు స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. హుష్మకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.