సిరిసిల్ల జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుది. పక్కింటి మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడి.. ఆ తర్వాత హత్య చేసి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికుల వివరాల ప్రకారం.. జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో రేఖ అనే వివాహితను పక్కింట్లో ఉంటున్న శ్రీకాంత్ అనే వ్యక్తి హత్య చేసి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. రేఖ భర్త ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లాడు. మరోవైపు, శ్రీకాంత్ భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో చెల్లి అనే పిలిచే శ్రీకాంత్.. రేఖను ఇంట్లోకి వచ్చిన సమయంలో ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
ఆమె ప్రతిఘటించడంతో కోడవలితో నరికి చంపాడు. తర్వాత భయంతో శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్ట్ మార్టం కోసం రెండు మృతదేహాలను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, చెల్లి అని పిలిచే శ్రీకాంత్ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.