- Advertisement -
సంగారెడ్డిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను దుండగులు దారుణంగా హత్య చేశారు. జిల్లాలోని న్యాల్‌కల్ మండలం రుక్మాపూర్‌లో నివసిస్తున్న రాణెమ్మ(48) అనే ఒంటరి మహిళపై కొందరు దుండగులు దాడి చేశారు. ఆమెను సీసాతో పొడిచి చంపారు. అనంతరం ఆమె మీదున్న బంగారం, ఇంట్లోని నగదును తీసుకుని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -