Tuesday, September 9, 2025

విహార యాత్రలో విషాదం.. గుండెపోటుతో మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/భైంసా: విహారయాత్ర విషాదం నింపింది. భైంసా పట్టణానికి చెందిన సంగీత బచ్చువార్ (40) అనే మహిళ విహార యాత్రకు వెళ్లగా సోమవారం గుండెపోటుతో మరణించింది. ఇటీవల పట్టణానికి చెందిన 25 మంది బృందం నేపాల్ యాత్రకు వెళ్లారు. తిరిగి భైంసాకు వస్తుండగా బిహార్‌లోని పాట్నా పట్టణంలో సంగీతకు గుండెపోటు వచ్చింది. ఆమెను హుటా హుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనతో సంగీత బచ్చువార్ కుటుంబంలో విషాదం నింపింది. ఆమె మృతదేహాన్ని భైంసాకు తీసుకవచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. మంగళవారం వరకు మృతదేహం భైంసాకు చేరుకుంటుందని తెలుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News