Wednesday, August 27, 2025

ఖైరతాబాద్ వినాయకుడి వద్ద క్యూలైన్‌లో గర్భిణి ప్రసవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఓ గర్భిణీ కూడా బడా గణేషుడిని దర్శంచుకోవడానికి వచ్చింది. క్యూలైన్‌లో వెళ్తుండగా పురటి నొప్పులు రావడంతో ఆమె అక్కడే ప్రసవించింది. సదరు మహిళ రాజస్థాన్‌కు చెందిన రేష్మగా గుర్తించారు. అక్కడ ఉన్న వైద్య సిబ్బంది ఆమెకు వైద్యం అందిస్తున్నారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News