Sunday, September 7, 2025

లారీ ఢీకొని పారిశుద్ధ్య కార్మికురాలు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బషీర్ బాగ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొనడంతో పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందింది. జిహెచ్ ఎంసి కార్మికురాలు రేణుక విధులలో భాగంగా బషీర్ బాగ్ వద్ద రోడ్డును శుభ్రం చేస్తుండగా ఆమెను లారీ ఢీకొట్టింది. దీంతో కార్మికులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేస్తున్నారు. మృతురాలు గుడిమల్కాపూర్ కు చెందిన మహిళగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Also Read : కన్నతండ్రిని చంపి నదిలో పడేశాడు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News